Tuesday, November 26, 2024

నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత్, ఆస్ట్రేలియా ప్రధానుల సందడి

అహ్మదాబాద్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య బోర్డర్ గావస్కర్ ట్రోఫీ 2023 (Border Gavaskar Trophy 2023)లో భాగంగా చివరి టెస్ట్ ఆరంభమైంది. తొలి మూడు టెస్టుల్లో రెండింటిలో నెగ్గిన భారత్ సిరీస్ లో ఆధిక్యంలో ఉంది. నాలుగో టెస్టులో భారత్ గెలిస్తే సిరీస్ తో పాటు వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో కూడా అడుగుపెట్టనుంది. ఈ ఏడాదితో భారత్, ఆస్ట్రేలియా బంధానికి 75 ఏళ్లు పూర్తి కానున్నాయి. దీనికి గుర్తుగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్నారు.

ఇక ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా ఉన్న శ్రీ నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనున్న నాలుగో టెస్టు మ్యాచ్ కు ప్రత్యేక అతిథులుగా ప్రధాన ప్రధాని మోడీ, ఆసీస్ ప్రధాని ఆంథోని అల్బనీస్ హాజరయ్యారు. ఇక మ్యాచ్ కు ముందు అద్బుత దృశ్యం చోటు చేసుకుంది. ఇరు దేశాల ప్రధానులు తమ కెప్టెన్లకు క్యాప్ లను అందజేసి విజయీభవ అంటూ ఆశీర్వదించారు. అనంతరం స్టీవ్ స్మిత్ ను మోడీ ఆప్యాయంగా పలకరించారు. రోహిత్ శర్మ, స్టీవ్ స్మిత్ లతో కలిసి మోడీ, ఆంథోని అల్బనీస్ లు అభివాదం పలికారు. అనంతరం ఇరువురు ప్రధానులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో గ్రౌండ్ మొత్తం తిరుగుతూ అభిమానులకు అభివాదం చేశారు. భారత క్రికెటర్లతో కలిసి భారత ప్రధాని మోడీ జాతీయ గీతాలపన చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement