బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్ లో భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ సత్తా చాటారు. ఈ సీజన్లో అత్తుత్తమ ప్రదర్శన చేస్తున్న ప్రణయ్ 9వ స్థానంలో, లక్ష్యసేన్ 11వ ర్యాంకుకు ఎగబాకారు. ఈమధ్యే ముగిసిన జపాన్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ స్టార్ ఆటగాళ్లు ఇద్దరూ అదరగొట్టారు. లక్ష్యసేన్ ఏకంగా సెమీస్‌కు దూసుకెళ్లాడు.
మరో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ ఒక అడుగు ముందుకేశాడు. ప్రస్తుతం అతను 19వ ర్యాంక్‌లో ఉన్నాడు. నేషనల్ చాంపియన్ మిధున్ మంజునాత్ ఏకంగా 4 స్థానాలు ఏగబాకి 50వ ర్యాంక్ సాధించాడు. ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు మహిళల ర్యాంక్సింగ్స్‌లో 17వ స్థానంలో ఉంది. ఈ ఏడాది ఆడిన ప్రతీ టోర్నమెంట్లో క్వార్టర్స్ కూడా దాటలేకపోయిన సింధూ గత పదేళ్లలో ఇదే తక్కువ ర్యాంక్ కావడం గమనార్హం.
మహిళల డబుల్స్‌లో..
డబుల్స్‌లో ఇరగదీస్తున్న సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టీ రెండో సీడ్ నిలబెట్టుకున్నారు. ఈ ఏడాది వీళ్లు కొరియా ఓపెన్‌తో కలిపి మూడు వరల్డ్ టూర్ టైటిళ్లు సాధించారు. దీంతో ఈమధ్యే మూడో ర్యాంక్ నుంచి రెండో ర్యాంకుకు ఎగబాకారు. మహిళల డబుల్స్‌లో త్రీసా జాలీ, గాయత్రీ గోపిచంద్ 17వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు.