పారిస్: ప్రపంచ నం.1 ఇగా స్వియాటెక్ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఉమెన్స్ సింగిల్స్ విభాగంలో శనివారంనాడు ఫిలిప్పే చార్టియర్ కోర్టులో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అమెరికా యువకెరటం కోకా గాఫ్‌పై సునాయాసంగా గెలుపొందింది. 6-1, 6-3తేడాతో వరుస సెట్లలో ఘన విజయం సాధించింది. గంటా 8 నిమిషాలపాటు సాగిన పోరులో స్వియాటెక్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఫోర్ హ్యాండ్, బ్యాక్ హ్యాండ్ షాట్లతో విరుచుకుపడుతూ…
ఆట ప్రారంభం నుంచి ఆధిపత్యం చెలా యించి విజయం సాధించింది. ఈ గెలుపుతో ఇగా రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే ఇగా ఖాతాలో 2020 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌తో గ్రాండ్‌స్లామ్ విజేతగా నిలిచిన తొలి పోలెండ్ సింగిల్స్ క్రీడాకారిణిగా రికార్డు ఉంది. ఫ్రెంచ్ ఓపెన్‌లో భాగంగా ఫైనల్ మ్యాచ్‌లో కోకోగాఫ్‌పై గెలుపొందడంతో స్వియాటెక్‌కు వరుసగా ఇది 35వ విజయం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.