Wednesday, November 20, 2024

IPL : స‌న్ రైజ‌ర్స్ తో మ్యాచా…వ‌ణ‌కిపోతున్న ప్ర‌త్య‌ర్థి జ‌ట్లు…

ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ప‌రుగుల సునామీకి కేరాఫ్ అవుతోంది. వేదిక ఏదైనా త‌మ విధ్వంసం ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్య‌ర్థుల‌కు రుచి చూపిస్తోంది. చూస్తున్న‌ది హైలెట్స్ అన్న రీతిలో సిక్స‌ర్ల మోత‌తో అభిమానుల‌కు పూన‌కాలు తెప్పిస్తోంది. దాంతో, ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ అంటేనే మిగ‌తా జ‌ట్ల‌న్నీ వ‌ణికిపోతున్నాయి.

అవును.. ఈ సీజ‌న్‌లో ఏదో శ‌క్తి ఆవ‌హించిన‌న‌ట్టుగా హైద‌రాబాద్ బ్యాట‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగుతున్నారు. తొలి ఓవ‌ర్‌నుంచే అటాకింగ్ గేమ్‌తో ఐపీఎల్ చ‌రిత్ర‌లో ప‌లు రికార్డుల‌ను ఆరెంజ్ అక్ష‌రాల్లో రాసేస్తున్నారు. ఈ మెగా టోర్నీలో ప‌రుగుల వ‌ర‌ద పారిస్తున్న హైద‌రాబాద్ జ‌ట్టు.. వ‌రుస‌గా 277, 2887, 266 కొట్టింది. అంతేనా ఏకంగా ప‌వ‌ర్ ప్లేలో 125 ప‌రుగుల‌తో మ‌రో రికార్డు నెల‌కొల్పి .. ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
పదిహేడో సీజ‌న్‌లో హైద‌రాబాద్ ఆట ఓ ట్రెండ్ సెట్ట‌ర్ అవుతోంది. బ‌రిలోకి దిగ‌డమే ఆల‌స్యం.. బంతిని బౌండ‌రీకి పంపే ఓపెన‌ర్ల తెగువ‌తో.. ఆ త‌ర్వాత‌ విరుచుకుప‌డే మిడిలార్డ‌ర్ అండ‌తో రికార్డుల పర్వానికి తెర‌తీస్తోంది. ముంబై ఇండియ‌న్స్ పై ఉప్ప‌ల్ స్టేడియంలో 277 ర‌న్స్ కొట్టిన ఆరెంజ్ ఆర్మీ.. ఆ త‌ర్వాత బెంగ‌ళూరుపై దండెత్తింది.

హెడ్ సూప‌ర్ సెంచ‌రీ, క్లాసెన్ విధ్వంసంతో త‌మ‌కు తామే సాట‌ని చాటుతూ 287 ప‌రుగుల‌తో ఐపీఎల్‌లో రికార్డు స్కోర్ బాదింది. అంతేనా.. రెండు విజ‌యాల‌తో జోరుమీదున్న‌ ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ని సైతం త‌మ ప‌రుగుల తుఫాన్‌లో నిండా ముంచింది. ఇంకేముంది.. భారీ విజ‌యంతో టేబుల్‌లో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

- Advertisement -

ఏ ముహూర్తాన కొన్న‌దో..
నిరుడు ఆసీస్ ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్.. కెప్టెన్ ప్యాట్ క‌మిన్స్‌ల‌ను మినీ వేలంలో కావ్య మార‌న్ బృందం ఏ ముహూర్తాన‌ కొన్న‌దో.. అప్ప‌టి నుంచే ఆరెంజ్ ఆర్మీపై అంచ‌నాలు పెరిగిపోయాయి. అనుకున్న‌ట్గుగానే హైద‌రాబాద్ ఆటే మారిపోయింది. దూకుడే మంత్రగా భారీ స్కోర్ల‌తో ప్ర‌త్య‌ర్థుల‌ను స‌న్‌రైజ‌ర్స్ భ‌య‌పెడుతోంది. టాపార్డ‌ర్‌లో ట్రావిస్ హెడ్(… అభిషేక్ శ‌ర్మలు కొకాబుర్రా బంతిని ఉతికేస్తుంటే.. మిడిల్‌లో మ‌ర్క్‌ర‌మ్, హెన్రిచ్ క్లాసెన్ లు దంచేస్తున్నారు. ఇక చివ‌ర్లో అబ్దుల్ స‌మ‌ద్ మెరుపులు మెరిపిస్తున్నాడు.

ఇప్ప‌టివ‌ర‌కూ హెడ్, అభిషేక్, క్లాసెన్, మ‌ర్క్‌ర‌మ్, స‌మ‌ద్.. ఈ ఐదుగురే అనుకుంటే ఇప్పుడు ష‌హ్‌బాజ్ అహ్మ‌ద్ ) వీళ్ల‌తో క‌లిశాడు. ఇంకేముంది ఢిల్లీపై హైద‌రాబాద్ స్కోర్ బోర్డు వాయువేగంతో ప‌రుగులు పెట్టింది. ఇక బ్యాట‌ర్లు కొండంత స్కోర్ అందిస్తుంటే.. క‌మిన్స్ నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ బంతితో చెల‌రేగుతూ ప్య‌త్య‌ర్థి బ్యాట‌ర్ల‌కు క‌ళ్లెం వేస్తోంది. ఈ సీజ‌న్‌లో ఊహించ‌ని రీతిలో చెల‌రేగుతున్న క‌మిన్స్ బృందం సృష్టించిన‌ రికార్డులను ఇప్ప‌ట్లో చెరిగిపోయేలా లేవు. ఇదే జోష్‌లో స‌న్‌రైజ‌ర్స్ మ‌రో టైటిల్‌ను ఒడిసిప‌డితే చూసి త‌రించాల‌ని కోట్లాదిమంది ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement