Tuesday, November 26, 2024

అవకాశమిస్తే ఐపీఎల్‌లో ఆడతా .. న్యూజిలాండ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌

న్యూఢిల్లి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ఆడే అవకాశమొస్తే తప్పకుండా మెగాలీగ్‌లో ఆడతానని కివిస్‌ స్టార్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ మంగళవారం తెలిపాడు. క్యాష్‌రిచ్‌ లీగ్‌లో ఆఫ్‌స్పిన్నర్‌గా ఆడేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తానని అజాజ్‌ వెల్లడించాడు. వచ్చే ఏడాది ఐపీఎల్‌లో మొత్తం 10జట్లు టైటిల్‌ కోసం తలపడనున్నాయి. లక్నో, అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీలు కొత్తగా బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలో లెఎn్టార్మ్‌ స్పిన్నర్‌ అజాజ్‌ పటేల్‌ను మెగా వేలంలో దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు పోటీపడే అవకాశం ఉంది. భారత సంతతికి చెందిన అజాజ్‌ పటేల్‌ తను పుట్టిన ముంబైలోనే అరుదైన రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.

ముంబైలోని వాంఖేడ్‌ స్టేడియంలో భారత్‌తో జరిగిన రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మొత్తం 10వికెట్లు పడగొట్టి ప్రపంచ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. 1956లో ఇంగ్లండ్‌ స్పిన్నర్‌ జిమ్‌లేకర్‌ ఆస్ట్రేలియాపై ఒకే ఇన్నింగ్స్‌లో 10వికెట్లు తీసి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అనంతరం 1999లో భారత్‌ స్పిన్‌ దిగ్గజం జంబో కుంబ్లే దాయాది పాక్‌పై ఢిల్లిdలో జరిగిన టెస్టులో ఒకే ఇన్నింగ్స్‌లో 10వికెట్లు తీసి చరిత్ర పునరావృతం చేశాడు. తాజాగా వీరి సరసన అజాజ్‌ పటేల్‌ కూడా చేరాడు. ఐపీఎల్‌ గురించి అజాజ్‌ మాట్లాడుతూ ప్రపంచంలో మరే టీ20లీగ్‌కు లేని ఆదరణ ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు ఉందని పేర్కొన్నాడు. అవకాశం వస్తే మెగాలీగ్‌లో తనను తను నిరూపించుకుంటానని తెలిపాడు. కాగా అజాజ్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నా న్యూజిలాండ్‌ రెండో టెస్టులో ఓటమిపాలై తద్వారా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది. వరుసగా సొంతగడ్డపై 14వ టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా కివీస్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-0తేడాతో గెలుచుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement