Saturday, November 23, 2024

ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. నాలుగో స్థానంలో మిథాలీ

ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ (727) రెండు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంకుకు చేరుకుంది. ఇక అగ్ర స్థానంలో ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలిస్సా హీలీ (742) కొనసాగుతున్నది. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లానింగ్‌ అద్భుతంగా రాణించింది. ఈ మ్యాచ్‌లో లానింగ్‌ 110 బంతుల్లో 86 రన్స్‌ చేసింది. ఇక మరో ఆసీస్‌ క్రికెటర్‌ రిచెల్‌ హేయన్స్‌ ఆరు స్థానాలు ఎగబాకి ఏడో స్థానానికి చేరుకుంది. అదేవిధంగా వెస్టిండీస్‌ ఆల్‌ రౌండర్‌ హైలీ మాథ్యూస్‌ ఏకంగా 12 స్థానాలు ఎగబాకి 20వ స్థానానికి చేరుకుంది.

భారత్‌ సారథి మిథాలీ ఒక స్థానం దిగజారి నాల్గో స్థానానికి చేరుకోగా.. ఓపెనర్‌ మంధాన 10వ ర్యాంకులో నిలిచింది. ఇక పాక్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన పూజా, స్నేహ్‌ రానా తమ కెరీర్‌లో అత్యుత్తమ స్థానాలకు చేరుకున్నారు. బౌలర్ల విభాగంలో ఆసీస్‌ స్పిన్నర్‌ జానెసన్‌ టాప్‌లో ఉండగా.. ఇంగ్లండ్‌ బౌలర్‌ సోఫియా ఎకిలిస్టన్‌ రెండో స్థానానికి చేరుకుంది. కాగా భారత్‌ నుంచి జూలన్‌ గోస్వామి తప్ప మిగిలిన బౌలర్లు ఎవరూ టాప్‌-10లో చోటు దక్కలేదు. జూలన్‌ గోస్వామి బౌలర్ల విభాగంలో నాల్గో స్థానంలో కొనసాగుతున్నది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement