Tuesday, November 19, 2024

ICC | 2025-29 మహిళల ఫ్యూచర్ టూర్ ప్రోగ్రామ్ రిలీజ్ !

కొత్తగా ప్రకటించిన మహిళల 2025-2029 ఫ్యూచర్‌ టూర్స్‌ ప్రోగ్రామ్‌లో భారతదేశం ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, జింబాబ్వేలకు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌లతో విదేశీటూర్‌లో మ్యాచ్‌లు ఆడనుంది.

ఈ మేరకు సోమవారం ఐసిసి షెడ్యూల్‌ ప్రకటించింది. ఎఫ్‌టీపీ అనేది ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌ నాల్గవ ఎడిషన్‌ మ్యాచ్‌ల షెడ్యూలింగ్‌. రెండవ ఎఫ్‌టీపీ మే 2025 నుంచి ఏప్రిల్‌ 2029 వరకు కొనసాగుతుంది.

ఈ షెడ్యూల్‌లో2027లో ఐసీసీ మహిళల చాంపియన్స్‌ ట్రోఫీ, వన్డే వరల్డ్‌ కప్‌-2025 (ఇండియా), టీ20 వరల్డ్‌కప్‌-2026 (యూకే), టీ20 వరల్డ్‌కప్‌-2028 కూడా ఉన్నాయి. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే జట్ల సంఖ్య ఈసారి 11కి చేరుకుంది. జింబాబ్వే తొలిసారి ఛాంపియన్‌షిప్‌లో చేరింది. ఈ ఎఫ్‌టీపీలో 2026లో జరిగే డబ్ల్యుపీఎల్‌ (జనవరి-ఫిబ్రవరి), హండ్రెడ్‌ (ఆగస్టు), డబ్ల్యుబీబీఎల్‌ (నవంబర్‌) టోర్నీలకు విడివిడిగా షెడ్యూల్‌ ఇవ్వబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement