Wednesday, November 20, 2024

ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌.. మూడోస్థానంలో భారత్‌

అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో భారతజట్టు మూడోస్థానానికి పడిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ప్రతిష్ఠాత్మక యాషెస్‌ సిరీస్‌ 4-0తో గెలుచుకున్న ఆస్ట్రేలియా ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. ఆస్ట్రేలియా 119పాయింట్లు, న్యూజిలాండ్‌ 117పాయింట్లుతో రెండో స్థానాన్ని నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికా చేతిలో 2-1తేడాతో సిరీస్‌ కోల్పోయిన భారత్‌ 116పాయింట్లుతో మూడోస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 101పాయింట్లుతో ఇంగ్లండ్‌, 99పాయింట్లుతో దక్షిణాఫ్రికా టాప్‌-5లో నిలిచాయి.కాగా ఐసీసీ టెస్టు, వన్డే , టీ20 జట్లును ప్రకటించింది. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని టెస్టు జట్టులో రోహిత్‌, పంత్‌, అశ్విన్‌ చోటుదక్కించుకున్నారు. అయితే పురుషు వన్డేజట్టులో ఒక్క భారత క్రికెటర్‌కు చోటు దక్కలేదు. ఐసీసీ మహిళల వన్డే జట్టులో మిథాలీరాజ్‌ చోటు దక్కించుకోగా, టీ20 జట్టులో భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధానకు చోటు లభించింది.


ఐసీసీ టెస్టు జట్టు ఇదే: కరుణరత్నే, రోహిత్‌శర్మ, లబుషేన్‌, జోరూట్‌, కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), ఫవాద్‌ ఆలమ్‌, రిషభ్‌పంత్‌ (వికెట్‌కీపర్‌), ఆర్‌ అశ్విన్‌, కైల్‌ జెమీసన్‌, హసన్‌ అలీ, షహీన్‌ అఫ్రిదీ.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement