టీ20 ప్రపంచకప్‌కు 10వ ఎడిషన్‌కు సంబంధించి ఐసీసీ కీలక ప్రకటన విడుదల చేసింది. టీ20 ప్రపంచ కప్ 2026 కు 12 జట్లు నేరుగా అర్హత సాధించాయి. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-8 దశకు చేరుకున్న 8 జట్లు నేరుగా అర్హత సాధించగా… మిగిలిన 4 జట్లను టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా ఐసీసీ ఎంపిక చేసింది.
పాక్‌కు గోల్డెన్ ఛాన్స్.. కివీస్‌కు లక్కీ ఛాన్స్..
తాజా టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్లు ఐసీసీ టీ20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా టీ20 ప్రపంచకప్ 2026కు అర్హత సాధించాయి. ఇక భారత్‌తో పాటు శ్రీలంక కూడా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుండగా… ఈ శ్రీలంకకు కూడా 2026 టీ20 ప్రపంచకప్‌కు ప్రవేశం లభించింది. టీ20 ప్రపంచకప్‌లో తొలిసారిగా సూపర్-8 దశకు చేరుకున్న అమెరికా జట్టు తదుపరి టీ20 ప్రపంచకప్‌లో కూడా చోటు దక్కించుకుంది.