టీ20 వరల్డ్ కప్ ఎనిమిదో ఎడిషన్ ఆస్ట్రేలియాలోని గీలాంగ్‌లో ఇవ్వాల (ఆదివారం) ప్రారంభం అయ్యంది. ఆసియా కప్ విజేత శ్రీలంక, తమ చివరి ఐదు టీ20 మ్యాచ్‌లను గెలిచి మంచి ఫామ్‌లో ఉంది. ఇవ్వాల జరిగే తొలి మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా నమీబియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. కాగా, నమీబియా 3 ఓవర్లలోనే 17 పరుగులు మాత్రమే చేసి రెండు కీలక వికెట్లను పోగొట్టుకుంది.
ఇక.. పిచ్ కఠినంగా ఉందని, దానిపై కొద్దిగా గడ్డి కూడా ఉండడంతో బౌలింగ్‌కు ఉపకరిస్తుందని లంక ఆటగాళ్లు భావించి తొలుత బౌలింగ్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక.. 3 ఓవర్ల వరకు చమేరా, మధుశాన్ తలో వికెట్ తీసుకున్నారు.
శ్రీలంక ప్లేయింగ్ XI: పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్ (కీపర్), ధనంజయ డి సిల్వా, దనుష్క గుణతిలక, భానుక రాజపక్ష, దసున్ షనక (సి), వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, ప్రమోద్ లియానగమగే, మహేశ్ తీక్షణ
నమీబియా ప్లేయింగ్ XI: దివాన్ లా కాక్, మైకేల్ వాన్ లింగేన్, స్టీఫన్ బార్డ్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, గెరార్డ్ ఎరాస్మస్ (సి), జాన్ ఫ్రైలింక్, JJ స్మిత్, డేవిడ్ వైస్, జేన్ గ్రీన్ (కీపర్), బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో