Tuesday, November 26, 2024

ICC T20 Rankings | అగ్రస్థానంలో హార్దిక్ పాండ్యా..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్ అనంతరం ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ విడుదల చేయగా.. రెండు స్థానాలు మెరుగుపరుచుకున్న హార్దిక్ పాండ్యా.. శ్రీలంక ఆల్‌రౌండర్‌ వానిందు హసరంగాతో కలిసి టాప్‌ ర్యాంక్‌లో నిలిచాడు.

ఈ ఇద్దరూ 222 రేటింగ్ పాయింట్స్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. ఇక‌ మార్కస్ స్టోయినీస్, సికిందర్ రాజా, షకీబ్ అల్ హసన్ టాప్-5లో కొనసాగుతున్నారు. మరే భారత ఆల్‌రౌండర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు.

బౌలింగ్ విభాగంలో అక్షర్ పటేల్ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకొని ఏడో స్థానంలో నిలవగా.. కుల్దీప్ యాదవ్ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 9వ ర్యాంక్ అందుకున్నాడు. ఈ టోర్నీలో 17 వికెట్లు తీసిన జస్‌ప్రీత్ బుమ్రా 12 స్థానాలను మెరుగుపరుచుకొని 12వ స్థానంలో నిలిచాడు. వరల్డ్ బెస్ట్ పేసర్ అయిన బుమ్రా గతేడాదిగా టీ20లకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.

- Advertisement -

బ్యాటింగ్ విభాగంలో సూర్యకుమార్ యాదవ్ తన రెండో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా.. యశస్వి జైస్వాల్ ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు. సెమీఫైనల్, ఫైనల్లో సూర్య విఫలమవడంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. ట్రావిస్ హెడ్ టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ICC ర్యాంకింగ్స్…

టీ20 ప్రపంచ కప్‌లో టీమ్ ఇండియా చారిత్రాత్మక విజయం తర్వాత, భారత క్రికెట్ దిగ్గజాలు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించి వారి అద్భుతమైన టీ20 కెరీర్‌ను ముగించారు.

అయితే, కెప్టెన్‌గా, కీలక బ్యాట్స్‌మెన్‌గా అర్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన రోహిత్ శర్మ…. ఈ టోర్నీలో 8 ఇన్నింగ్స్‌లలో 156.71 స్ట్రైక్ రేట్‌తో 257 పరుగులు చేశాడు. దీంతో ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి 36వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

ఇక విరాట్ కోహ్లీ టోర్నమెంట్ అంతటా స‌రైన‌ ఫామ్‌లో లేకపోయినా 8 ఇన్నింగ్స్‌లలో 151 పరుగులు చేయగలిగాడు. దీంతో ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి టీ20 కెరీర్‌ను 40వ ర్యాంక్‌తో ముగించాడు.

ఇక ఐసీసీ టీ20 బ్యాటర్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియాకు చెందిన ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో ఉండగా, భారత పవర్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో ఉన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement