టీమిండియా విధ్వంసకర బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 859 పాయింట్లతో నంబర్‌వన్ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్‌లో 239 పరుగులు చేసిన సూర్యకుమార్ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో మూడోస్థానంలో ఉన్నారు. ఇక ఆతర్వాత పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 836 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాక్ కెప్టెన్ బాబర్ ఆజం 778 పాయింట్లతో మూడోస్థానానికి చేరుకున్నారు.
ఇంగ్లండ్ ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఏకంగా 22స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకున్నారు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ 704 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచారు. అఫ్గన్ బౌలర్ రషీద్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్ అదిల్ రషీద్ మూడో స్థానంలో నిలిచారు.