ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు భారత్-న్యూజిలాండ్ మధ్య ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించి ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ డ్రా లేదా టై అయితే రెండు జట్లను విజేతలుగా ప్రకటిస్తామని తెలిపింది. ఒకవేళ వర్షం వల్ల ఐదు రోజుల్లో ఎప్పుడైనా మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడితే మరొక రోజు మ్యాచ్‌ను నిర్వహించేలా రిజర్వు డేను ప్రకటించింది.
కాగా కరోనా కారణంగా ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్‌కు ప్రతిరోజు 4వేల మందిని మాత్రమే స్టేడియంలోకి అనుమతించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈసీబీ ప్రకటించింది. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం భారత్, న్యూజిలాండ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.