Friday, November 22, 2024

బ్యాటింగ్​లో తడబాటు.. కోహ్లీని చూస్తే జాలేస్తోందన్న ఇయాన్​ బిషప్​

విరాట్‌ కోహ్లీని చూస్తే జాలేస్తోందని వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ బిషప్‌ తెలిపాడు. ఒకప్పుడు కింగ్‌లా కనిపించిన కోహ్లీ.. ఇప్పుడు తీవ్రంగా తడబడుతున్నాడని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా స్పిన్‌ బౌలింగ్‌లో ఆడలేకపోతున్నాడని, సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లోనూ స్పిన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడని తెలిపాడు. డుప్లెసిస్‌ మంచి ఆరంభం ఇచ్చినా.. అదే ఊపును కొనసాగించలేకపోయాడని వివరించాడు. వన్డే తరహాలో 33 బంతుల్లో 30 పరుగులు చేసి.. చివరికి స్పిన్‌ బౌలర్‌ మోయిన్‌ అలీ చేతులోనే ఔటయ్యాడని తెలిపాడు. ఒకప్పుడు స్పిన్‌ బౌలింగ్‌ ఎంతో బాగా ఆడిన కోహ్లీ.. ఇలా ఎందుకు పేలవమైన ప్రదర్శన కనబరుస్తున్నాడో అర్థం కావడం లేదన్నాడు.

స్పిన్‌ బౌలింగ్‌ ఇప్పుడు కోహ్లీకి పెద్ద బలహీనతగా మారిందని చెప్పుకొచ్చాడు. బౌండరీలు కొట్టలేని స్థితిలో సింగిల్స్‌తోనే వేగంగా ఆడే కోహ్లీ ఇప్పుడు కనిపించడం లేదని, కోహ్లీ అర్ధ సెంచరీ కొడితే.. అందులో 10 నుంచి 15 పరుగులు సింగిల్స్‌ ఉండేవని, అలాంటి స్పిన్‌ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కోలేకపోతున్నాడని చెప్పుకొచ్చాడు. గత సీజన్‌తో పాటు అంతర్జాతీయ మ్యాచుల్లో స్పిన్‌ బౌలింగ్‌ ఎదుర్కోవడంలో విఫలం అవుతూ వస్తున్నట్టు తెలిపాడు. బుధవారం సీఎస్‌కేతో ఆడిన మ్యాచ్‌లో 16 డాట్‌ బాల్స్‌ చేశాడు. చివరికి గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ను రనౌట్‌ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement