Tuesday, November 26, 2024

Sri Lanka Tour | నా ప్లాన్స్ నాకున్నాయి : సూర్య కుమార్

టి20కి కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు.. అత‌డే స్కై సూర్య.. ఈ హిట్ కెప్టెన్సీని ఎలా కొనసాగిస్తాడో అనే ఆసక్తి పెరిగింది. అయితే, సారథిగా బాధ్యతలు నిర్వర్తించడం కష్టమేమి కాదని కొత్త కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. ఆటగాళ్లతో పరిచయం ఉండటంతో వాళ్ల బలాబలాల తనకి తెలుసు అని తెలిపాడు. డిఫ్రెంట్‌గా ట్రై చేయకుండా సింపుల్‌గా ఉంటే సరిపోతుందని పేర్కొన్నాడు.

”ఈ కొత్త బాధ్యతలను ఆస్వాదిస్తాను. మేం అంతా కలిసి ఎంతో సమయాన్నిగడిపాం. కలిసి ఎంతో క్రికెట్ ఆడాం. ఫ్రాంచైజీ, దేశవాళీ క్రికెట్‌లో ఆడాం. కాబట్టి ఆటగాళ్ల బలాలు, బలహీనతలు తెలుసుకోవడం కష్టమేమి కాదు. మైదానంలో అవతల కూడా ప్లేయర్లతో అనుబంధం ఉంది..” అన్ని విషయాలు చాలా సింపుల్‌గా ఉండేలా ప్రయత్నిస్తాను. ప్రక్రియను ఎక్కువగా నమ్మే వ్యక్తిని. జట్టులోని ఆటగాళ్లకు కూడా సింపుల్‌గా ఉండమనే చెప్తాను. భిన్నంగా ప్రయత్నించకుండా సరళంగా, సహజసిద్ధంగానే ఉండటానికి ప్రయత్నించాలని సహచరులకు సూచిస్తాను” అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.

కాగా, సూర్య గతంలో కూడా భారత్‌కు కెప్టెన్సీ వహించాడు. రోహిత్, హార్దిక్ గైర్హాజరీలో టీ20 జట్టును నడిపించాడు. గతేడాది నవంబరులో సూర్య సారథ్యంతో భారత్ ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్‌ను 4-1తో గెలుచుకుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్‌ను 1-1తో డ్రాగా ముగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement