హైటెన్షన్ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది. ఆఖరి బంతి దాకా అందరినీ ఊపిరి బిగపట్టుకుని ఉండేలా చేశారు బ్యాటర్లు.. అయితే.. ఈ మ్యాచ్‌లో తొలుత రాజస్థాన్ రాయల్స్ 214 పరుగులు చేయగా.. చేజింగ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు సత్తా చాటారు. కాగా, చివరి బంతికి అయిదు పరుగులు చేయాల్సి ఉండగా.. సింగిల్ తీశాడు సమద్.. ఇక అందరూ రాజస్త్థాన్ గెలిచింది అనుకున్నారు. కానీ, ఇక్కడే ట్విస్ట్ నెలకొంది.. రాజస్థాన్ రాయల్స్ బౌలర్ సందీప్‌శర్మ నోబాల్ వేయడంతో ఫ్రీ హిట్ దక్కింది. దీంతో ఆఖరి బంతిని సిక్స్‌గా మలిచి హైదరాబాద్‌కు విజయం కట్టబెట్టాడు సమద్. ఈ క్రమంలో నాలుగు వికెట్ల తేడాతో హైదరాబాద్ జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గెలుపొందింది.
- Advertisement -