ఐపీఎల్లో ఇవ్వాల (సోమవారం) రాత్రి గుజరాత్, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో తొలుత గుజరాత్ 9 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. కాగా, టార్గెట్ 189 పరుగుల టార్గెట్లో హైదరాబాద్ ఆదిలోనే ఇబ్బందులకు గురయ్యింది. త్వరత్వరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిపోయింది.
ఈ క్రమంలో హెన్రిక్ క్లాసిక్ 44 బంతుల్లో (64) పరుగులు చేశాడు. ఆ తర్వాత భువనేశ్వర్ (27) పరుగులు చేశాడు. ఇక మిగతా వారంతా కనీసం సింగిల్ డిజిట్ దాటి రన్స్ తీయలేకపోయారు. దీంతో హైదరాబాద్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 154 పరుగుల మాత్రమే చేయగలిగింది. ఇక.. గుజరాత్ 34 పరుగుల తేడాతో గెలుపొందింది.