Tuesday, January 14, 2025

IPL 2025 | గుడ్ న్యూస్.. ప్లే ఆఫ్ మ్యాచ్‌లకు వేదికగా హైదరాబాద్ !

హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్… ఐపీఎల్ 2025 మార్చి 21న ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సీజన్‌లోని రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరగనున్నాయి.

గతేడాది రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ హోం గ్రౌండ్ కు రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు కేటాయించారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో క్వాలిఫయర్ 1తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి.

2024 సీజన్‌లో కోల్‌కతా జట్టు కప్ కైవ‌సం చేసుకోగా… ఆ జట్టు హోమ్‌గ్రౌండ్ అయిన కోల్‌కతాలో టోర్నీలోని మొదటి, చివరి మ్యాచ్‌లకు జ‌ర‌గ‌నున్నాయి.

ఇక ఐపీఎల్ పూర్తి షెడ్యూల్‌ను ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. గత సీజన్ మాదిరే ఐపీఎల్ 2025 సీజన్‌లోనూ 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement