టీ20 వరల్డ్‌కప్ ట్రోఫీ నెగ్గిన టీమ్‌ఇండియా స్వదేశానికి రావడం మరింత ఆలస్యం కానుంది. వెస్టిండీస్‌లో హరికేన్ తుపాన్ కారణంగా భారత క్రికెట్ జట్టు బార్బడోస్‌లోనే ఉండిపోయింది. తుపాన్ దెబ్బకు విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బార్బడోస్‌లోని విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. దీంతో టీమ్‌ఇండియా ప్లేయర్లంతా తాము బస చేస్తున్న హోటల్‌లోనే ఉండిపోయారు. బార్బడోస్‌లో కర్ఫ్యూ దృష్ట్యా భారత క్రికెట్ జట్టు- స్వదేశానికి రావడం ఆలస్యం అయ్యేలా కనిపిస్తోంది.
మరోవైపు పొట్టి వరల్డ్ కప్ ట్రోఫీ గెలుపొంది యావత్ దేశాన్ని సంబురాల్లో ముంచిన రోహిత్ సేనకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పి, ఘనంగా సన్మానించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జైషా స్వయంగా వెల్లడించారు. క్రికెటర్లు అక్కడ నుంచి బయల్దేరిన తర్వాత ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తామని జై షా చెప్పారు.