ఒమన్ వేదికగా పురుషుల హాకీ 5 ప్రపంచకప్ జరుగుతొంది. ఈ టోర్నీలో భారత జట్టు ఈజిప్ట్, జమైకా, స్విట్జర్లాండ్‌లతో పాటు గ్రూప్ బీలో ఉంది. కాగా, ఇవ్వాల (సోమవారం) జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో జమైకాపై 13-0తో భారీ విజయం సాధించింది భారత జట్టు. దీంతో పాయింట్స్ టేబుల్‌లో రెండవ స్థానంలో నిలిచని మెన్ ఇన్ బ్లూ క్వార్టర్‌ఫైనల్‌లోకి ప్రవేశించారు.
ఇక ఇప్పటికే జిరిగిన రెండు మ్యాచ్‌లో భారత జట్టు తమ మొదటి మ్యాచ్‌లో స్విట్జర్లాండ్‌పై 9-1 తేడాతో ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఈజిప్ట్‌తో తలపడగా.. ఒటమి చవిచూసింది. గ్రూప్ దశ ముగిసే సమయానికి ఒక్కో గ్రూపు నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు జనవరి 30న జరగే క్వార్టర్ ఫైనల్ & నాకౌట్స్‌కు చేరుకుంటాయి. ఇక, భారత్‌తో పాటు గ్రూప్ బీలో ఉన్న ఈజిప్ట్ మూడు విజయాలతో క్వార్టర్స్‌కు చేరుకుంది. ఇక 31న (బుధవారం) ఫైనల్ మ్యాచ్ జరగనుంది.