ఎఫ్ఐహెచ్ హాకీ పురుషుల జూనియర్ ప్రపంచ కప్‌లో భారత్ శుభారంభం చేసింది. ఇవ్వాల (మంగళవారం) మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన తమ మొదటి మ్యాచ్‌లో సౌత్ కొరియా పై 4-0 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదటి నుంచే కొరియాపై భారత్ తమ ఆధిపత్యం చెలాయించడంతో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచింది. కాగా, భారత పురుషుల హాకీ జట్టు తరఫున అరైజీత్ సింగ్ హుండాల్ హ్యాట్రిక్ సాధించి.. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు.
ఇక, ఈ విజయంతో భారత పురుషుల హాకీ జట్టు ‘‘పూల్ సి’’ పాయింట్ల పట్టికలో స్పెయిన్ తర్వాత రెండవ స్థానంలో నిలిచింది. ఉదయం జరిగిన మ్యాచ్ లో కెనడాను 7-0తో ఓడించిన స్పెయిన్ ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతొంది. కాగా, గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంటాయి. ఇక, భారత్ తమ తదుపరి గ్రూప్ గేమ్ లో గురువారం (డిసెంబర్ 7) స్పెయిన్‌తో తలపడనుంది.