బెంగళూరు: ఎఫ్‌ఐహెచ్ హాకీ వుమెన్స్ వరల్డ్ కప్ 2022 టోర్నమెంట్ జులై 1 నుంచి నెదర్లాండ్స్, స్పెయిన్‌లలో ప్రారంభం కానుంది. భారత మహిళల హాకీ బృందం పూల్-బీలో ఆడనుంది. ఇంగ్లండ్, చైనా, న్యూజిలాండ్ జట్లతో భారత్ టీమ్ తలపడనుంది. జులై 3న నెదర్లాండ్స్‌లోని అమ్స్‌టెల్వీన్‌లో ఇంగ్లండ్‌తో తొలి పోరు జరుగనుంది.
అంతకు ముందు భారత మహిళల హాకీ టీమ్ లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది. టోర్నమెంట్‌కు ముందు ఈ లీగ్ మ్యాచ్‌లు టీమ్‌కు ఎంతో దోహదపడనున్నాయి. జూన్ 11, 12 తేదీల్లో బెల్జియం, జూన్ 18, 19 తేదీల్లో నెదర్లాండ్స్, అర్జెంటీనాలతో తలపడనుంది. జూన్ 21, 22 తేదీల్లో యునైటెడ్ స్టేట్స్‌తో పోటీ పడనుంది. ప్రస్తుతం ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో అర్జెంటీనా, నెదర్లాండ్స్ తర్వాత స్థానంలో భారత్ కొనసాగుతోంది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..