Monday, November 25, 2024

హాకీ లెజెండ్‌ చరణ్‌జిత్‌సింగ్‌ కన్నుమూత..

భారత హాకీ లెజెండ్‌, పద్మశ్రీ పురస్కార గ్రహీత చరణ్‌జిత్‌సింగ్‌ (91) తుదిశ్వాస విడిచారు. వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గుండెపోటు రావడంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఉనాలోని స్వగృహంలో కన్నుమూశారు. మిడ్‌ఫీల్డర్‌గా సేవలందించిన చరణ్‌జిత్‌ 1964 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించిన భారతజట్టుకు సారథ్యం వహించారు.

1960 ఒలింపిక్స్‌లో ఆడిన భారతజట్టులో సభ్యుడిగా ఉన్నారు. చరణ్‌జిత్‌ భార్య పన్నేండేళ్ల క్రితమే మృతిచెందారు. గురువారం తమ తండ్రి అంత్యక్రియలు పూర్తిచేశామని చరణ్‌జిత్‌ కుమారుడు వీపీ సింగ్‌ తెలిపారు. కాగా ఒలింపియన్‌ చరణ్‌జిత్‌ మృతికి హాకీ ఇండియా, హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌ సంతాపం తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement