Monday, November 25, 2024

ఆసియా క్రీడలకు 33 మందితో హాకీ ప్రాబబుల్స్‌

ఆసియా క్రీడల సన్నాహ శిబిరానికి హాకీ ఇండియా మహిళల ప్రాబబుల్స్‌ను ప్రకటించింది. 33 మందితో కూడిన బృందంలో మాజీ కెప్టెన్‌ రాణిరాంపాల్‌కు చోటు దక్కలేదు. ఎంపికైన క్రీడాకారిణులు ఆదివారం బెంగళూరు శాయ్‌ క్యాంప్‌లో రిపోర్టు చేయాలని హాకీ ఇండియా తాజా ప్రకటనలో తెలిపింది. చైనాలో జరిగే ఆసియా క్రీడలకు ముందు సన్నాహక కార్యక్రమంగా మే 13 వరకు ఈ శిబిరం నిర్వహించబడుతుంది. టోక్యో ఒలింపిక్స్‌లో అసాధారణ విజయాల తర్వాత రాణి రాంపాల్‌ గాయాలతో సతమతం అవుతోంది. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు రాణి జట్టులో చోటు దక్కించుకుంది.

గతేడాది ఎఫ్‌ఐహెచ్‌ ఉమెన్స్‌ హాకీ ప్రో లీగ్‌లో బెల్జియంతో భారత్‌ తరఫున ఆమె తన 250వ గేమ్‌ ఆడింది. సన్నాహక శిబిరం తర్వాత, మేము మా జట్టు నిర్మాణం, వ్యూహాలను మెరుగుపరచాలని చూస్తున్నాము. ఈ శిబిరం ముగిసే సమయానికి ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాతో ఆడడం వల్ల మహిళల హాకీలో మనం ఎక్కడ ఉన్నామో అంచనా వేయడానికి వీలవుతుంది అని భారత మహిళల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ జాన్నెకే షాప్‌మన్‌ అన్నారు.

కోర్‌ ప్రాబబుల్స్‌ గ్రూప్‌

గోల్‌ కీపర్లు: సవిత, రజనీ ఎటిమార్పు, బిచు దేవి ఖరీబామ్‌ మరియు బన్సారీ సోలంకి.

- Advertisement -

డిఫెండర్లు: దీప్‌ గ్రేస్‌ ఎక్కా, గుర్జిత్‌ కౌర్‌, నిక్కీ ప్రధాన్‌, ఉదిత, ఇషికా చౌదరి, అక్షతా అబాసో ధేకాలే, జ్యోతి ఛత్రి, మరియు మహిమా చౌదరి.

మిడ్‌ ఫీల్డర్లు: నిషా, సలీమా టెటే, సుశీల చాను పుఖ్రంబం, జ్యోతి, నవజోత్‌ కౌర్‌, మోనికా, మరియానా కుజుర్‌, సోనికా, నేహా, బల్జిత్‌ కౌర్‌, రీనా ఖోఖర్‌, వైష్ణవి ఫాల్కే, మరియు అజ్మీనా కుజుర్‌.

ఫార్వర్డ్‌లు: లాల్‌రెమ్సియామి, నవనీత్‌ కౌర్‌, వందనా కటారియా, షర్మిలా దేవి, దీపిక, సంగీత కుమారి, ముంతాజ్‌ ఖాన్‌, మరియు సునేలిత టోప్పో

Advertisement

తాజా వార్తలు

Advertisement