Sunday, November 24, 2024

Hockey | ఆసియా దేశాల హాకీ సమరం.. భారత జట్టు ప్రకటన !

వచ్చే నెలలో భారత్ వేదికగా జరగనున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ కోసం హాకీ ఇండియా జట్టును ప్రకటించింది. సలీమా టెటే నాయకత్వంలో 18 మంది సభ్యులతో కూడిన జట్టును ఆసియా సమరానికి ఎంపిక చేసింది. నవనీత్ కౌర్ డిప్యూటీగా వ్యవహరించనున్నారు. గోల్ కీపర్లుగా సవిత, బిచు దేవి ఖరీబామ్ ఎంపికయ్యారు.

నవంబర్ 11 నుండి 20 వరకు బీహార్‌లోని రాజ్‌గిర్ హాకీ స్టేడియం వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది. గత ఎడిషన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా అవతరించిన భారత్.. భారీ అంచనాలతో బరిలోకి దిగింది. ఒలింపిక్ రజత పతక విజేతలైన చైనా, జపాన్, కొరియా, మలేషియా, థాయ్‌లాండ్‌ జట్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కోనుంది. నవంబర్ 11న భారత జట్టు తమ తొలి మ్యాచ్‌లో మలేషియాతో తలపడనుంది.

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీకి భారత హాకీ జట్టు:

  • గోల్ కీపర్లు: సవిత, బిచ్చు దేవి ఖరీబామ్
  • డిఫెండర్లు: ఉదిత, జ్యోతి, వైష్ణవి విఠల్ ఫాల్కే, సుశీల చాను పుఖ్రంబం, ఇషికా చౌదరి
  • మిడ్‌ఫీల్డర్లు: సలీమా టెటే(కెప్టెన్ ), నేహా, షర్మిలా దేవి, మనీషా చౌహాన్, సునేలితా టోప్పో, లాల్‌రెమ్సియామి
  • ఫార్వర్డ్‌లు: నవనీత్ కౌర్, ప్రీతి దుబే, సంగీత కుమారి, దీపిక, బ్యూటీ డంగ్‌డంగ్.
Advertisement

తాజా వార్తలు

Advertisement