శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తొలిసారి తన హిట్టింగ్ పవర్ చూపించాడు. ఆరంభంలోనే కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు తక్కువ స్కోర్లకే వెనుదిరిగినప్పటికి సూర్యకుమార్‌తో కలిసి రోహిత్ టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న రోహిత్.. ఓవరాల్‌గా 41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అరుదైన రికార్డులు అందుకున్నాడు. ఆసియాకప్ టోర్నీలో టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా నిలిచాడు. టీమిండియా తరపున టోర్నీలో రోహిత్ శర్మ 1000 పరుగులు పూర్తిచేసుకున్నాడు.
ఈ క్రమంలో సచిన్ పేరిటవున్న అత్యధిక పరుగుల(971) రికార్డును రోహిత్ తిరగరాశాడు. ఓవరాల్‌గా ఆసియాకప్‌లో అత్యధిక పరుగుల రికార్డు సనత్ జయసూర్య (1220 పరుగులు) పేరిట ఉంది. రెండవ స్థానంలో కుమార సంగక్కర (1075 పరుగులు) ఉన్నాడు. ఆసియాకప్‌లో అత్యధిక సిక్సర్ల రికార్డు రోహిత్‌శర్మ తనపేరిట లిఖించుకున్నాడు.