Wednesday, November 20, 2024

Hit Man Retain – హ‌ర్దిక్ పాండ్యాకు గాయం… ముంబై ఇండియ‌న్స్ కెప్టెన్ గా తిరిగి రోహిత్ శ‌ర్మ‌..

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ మళ్లీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. రాబోయే సీజన్‌లో హిట్‌ మ్యాన్‌ సారథ్యంలోనే ముంబై బరిలోకి దిగనుంది. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ తో జ‌రిగిన వ‌న్డే ప్రపంచ కప్ మ్యాచ్ లో గాయపడిన హార్దిక్‌ ఇప్పట్లో కోలుకోవడం కష్టమేనని వైద్య నివేదిక‌లు వెల్ల‌డించాయి. అతని చీలమండ గాయం చాలా తీవ్రంగా ఉందని ఐపీఎల్‌ ప్రారంభానికి పాండ్యా ఫూర్తి ఫిట్‌గా ఉండడం అనుమానమేనని సమాచారం. అందుకే ముందు జాగ్రత్తగా హార్దిక్‌ స్థానంలో రోహిత్‌ శర్మనే స్టాండింగ్‌ కెప్టెన్‌గా నియమించవచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు హార్దిక్‌ కానీ, ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ కానీ ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

అయితే గాయం కారణంగా హార్దిక్ పాండ్యా చాలా కాలం పాటు క్రికెట్‌కు దూరంగానే ఉండనున్నాడు. జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే T-20 సిరీస్‌తో పాటు, ఐపీఎల్‌ 2024లోనూ పాండ్యా ఆడకపోవచ్చు. అంటే హార్దిక్ తిరిగి రావడానికి 2-3 నెలలు పట్టవచ్చు. అంటే డైరెక్టుగా టి20 ప్రపంచ కప్‌లోనే హార్దిక్‌ బరిలోకి దిగనున్నాడు. ఇలాంటి సమయంలో రోహిత్‌కే మళ్లీ సారథ్య బాధ్యతలు అప్పగించాలని ముంబై భావిస్తోంది. మరి ఇందుకు హిట్‌ మ్యాన్‌ అంగీకరిస్తాడా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement