Friday, November 22, 2024

WPLT20 | హైస్కోరు చేసిన ఢిల్లీ.. ఆర్‌సీబీకి ప‌రాజ‌యం!

ఆర్‌సీబీ, ఢిల్లీ విమెన్స్ జ‌ట్ల మ‌ధ్య బెంగ‌ళ‌రులోని చిన్న‌స్వామి స్టేడియంలో మ్యాచ్ జ‌రిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జ‌ట్టు నిర్ణీ ఓవ‌ర్ల‌లో అత్య‌ధిక (194)ప‌రుగులు చేసింది. ఆర్‌సీబీ ముందు అతి పెద్ద 195 ప‌రుగుల టార్గెట్ సెట్ చేసింది. కాగా, చేజింగ్‌కు దిగిన బెంగ‌ళూరు జ‌ట్టు కాసేపు ఫోర్లు, సిక్స్‌ల‌తో అభిమానుల‌ను ఉర్రూత‌లూగించినా.. కెప్టెన్ సృతి మంధ‌న (74) అవుటు కావ‌డంతో ఆ వెంట వెంట‌నే మ‌రో రెండు వికెట్ల‌ను కోల్పోయింది. ఈ క్ర‌మంలో మేఘ‌న (36), వ‌రీహం(6), డిక్ల‌ర్క్ (1), వ‌రుస‌గా అవుట‌య్యారు. ఈ క్ర‌మంలో ప‌రుగులు చేయ‌డంలో ఇబ్బంది ప‌డ్డారు. దీంతో నిర్ణీత ఓవ‌ర్ల‌లో 9 వికెట్లు కోల్పోయి 169 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగారు. కాగా, ఢిల్లీ 25 పరుగుల తేడాతో విజయం సాధించింది.

హ‌య్య‌స్ట్ స్కోరు..

రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ)తో ఈ సీజన్‌లో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ దంచికొట్టింది. ఆ జట్టు బ్యాటర్లు షఫాలీ వర్మ (31 బంతుల్లో 50, 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అలీస్‌ క్యాప్సీ (33 బంతుల్లో 46, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మరిజన్నె కాప్‌ (16 బంతుల్లో 32, 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జెస్‌ జొనాసెన్‌ (16 బంతుల్లో 36 నాటౌట్‌, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రెచ్చిపోయి ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ 5 వికెట్ల నష్టానికి 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ సీజన్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఆర్సీబీ బౌలర్లంతా తేలిపోవడంతో బెంగళూరులో ఆ జట్టు భారీ స్కోరు ఛేదించాల్సి ఉంది.

ఆరంభంలోనే త‌డ‌బ‌డ్డ ఢిల్లీ..

టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈసారి శుభారంభం దక్కలేదు. కెప్టెన్‌ మెగ్‌ లానింగ్‌ 17 బంతులాడి 11 పరుగులే చేసింది. కానీ మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ మాత్రం ఆది నుంచే దూకుడుగా ఆడింది. నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమె ఇచ్చిన క్యాచ్‌ను శ్రేయాంక పాటిల్‌ జారవిడిచింది. దీంతో వచ్చిన అవకాశాన్ని షఫాలీ సద్వినియోగం చేసుకుంది. లానింగ్‌ను డెవిన్‌.. ఔట్‌ చేయడంతో ఢిల్లీ తొలి వికెట్‌ కోల్పోయింది.

- Advertisement -

షఫాలీ – క్యాప్సీ దూకుడు..

ఐదు ఓవర్లకు 32 పరుగులే చేసిన ఢిల్లీ.. తర్వాత ఆరు ఓవర్లలో 70కి పైగా పరుగులు సాధించింది. మోలినెక్స్‌ వేసిన ఆరో ఓవర్లో షఫాలీ 4, 6 కొట్టగా ఆశా శోభన వేసిన 8వ ఓవర్లో క్యాప్సీ రెండు ఫోర్లు బాదింది. వర్హెమ్‌ వేసిన 10వ ఓవర్లో క్యాప్సీ 6, 4 తో రెచ్చిపోయింది. శ్రేయాంక వేసిన 12వ ఓవర్లో షఫాలీ.. వరుసగా రెండు సిక్సర్లు బాది 30 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తిచేసుకుంది. కానీ అదే ఓవర్లో ఆఖరి బంతికి ఔట్‌ అయింది. దీంతో క్యాప్సీ – షఫాలీ మధ్య 43 బంతుల్లోనే నమోదైన 82 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాతి ఓవర్లోనే జెమీమా రోడ్రిగ్స్‌ కూడా డకౌట్‌ అయి నిరాశపరిచింది. దూకుడుగా ఆడి అర్థ సెంచరీకి చేరువైన క్యాప్సీ.. క్లర్క్‌ వేసిన 15వ ఓవర్లో ఆఖరి బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement