Tuesday, November 26, 2024

ఒలింపిక్స్‌ బరిలో 12 ఏళ్ల హెంద్ జజా..

ఒలింపిక్స్‌ బరిలో దిగనున్న అతిపిన్న వయస్కురాలుగా సిరియాకు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి హెంద్ జజా రికార్డు సృష్టించబోతోంది. 12 ఏళ్ల ఈ చిన్నారి ప్రపంచ టీటీ ర్యాంకింగ్స్‌లో ఆమె స్థానం 155. గత ఫిబ్రవరిలో జరిగిన పశ్చిమాసియా టేబుల్ టెన్నిస్ అర్హత టోర్నీలో టైటిల్ సాధించడం ద్వారా ఒలింపిక్స్‌‌లో బెర్త్ ఖరారు చేసుకుంది. అప్పటికి ఆమె వయసు 11 సంవత్సరాలే కావడం గమనార్హం.  1968లో జరిగిన మెక్సికో ఒలింపిక్స్‌లో రొమేనియాకు చెందిన 13 ఏళ్ల ఫిగర్ స్కేటర్ బిట్రీస్ పాల్గొంది.  ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు అంతకంటే తక్కువ వయసున్న హెంద్ ఇప్పుడు పోటీపడబోతోంది. 1896 ఏథెన్స్ ఆధునిక ఒలింపిక్స్‌లో పదేళ్ల వయసులో జిమ్నాస్ట్ దిమిత్రోస్ లౌండ్రాస్ కాంస్యం గెలిచాడు. ఒలింపిక్స్‌లో పోటీపడిన అతి పిన్న అథ్లెట్‌గా అతడి పేరు రికార్డులకెక్కింది.

ఇది కూడా చదవండి: నిరుద్యోగుల కోసం వనపర్తిలో వైఎస్ షర్మిల దీక్ష..


Advertisement

తాజా వార్తలు

Advertisement