చెక్ రిపబ్లిక్ యువ కెరటం లూసీ హవ్లీకోవా ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టోర్నీ విజేతగా నిలిచింది. శనివారంనాడిక్కడ జరిగిన ఫైనల్ పోరులో తన ప్రత్యర్థి అర్జెంటీనా క్రీడాకారిణి సొలన సియెర్రాపై 6-3, 6-3తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. ప్రత్యర్తి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆటను కొనసాగిం చింది. 73నిముషాలపాటు సాగిన పోరులో సొలనా సియెర్రాపై 9వ సీడెడ్ లూసీ హవ్లీకోవా పైచేయి సాధిం చింది.
దీంతో ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. చెక్ రిపబ్లిక్ తరఫున ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టైటిల్‌ను గెలిచిన క్రీడాకారిణుల్లో హవ్లీకోవా ఐదవ స్థానంలో నిలిచింది. 1972లో రెనట టొమనోవ, 1975లో మర్సికోవా, 1978లో హన మండ్లికోవా, 2021లో లిండ నోస్కోవాలు ఫ్రెంచ్ ఓపెన్ జూనియర్ టైటిల్ కిరీటాన్ని చేజిక్కించుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.