Friday, November 22, 2024

హసరంగ కీలక నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై

శ్రీలంక స్టార్‌ ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి సారించేందుకే తాను టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుంకుంటున్నట్లు హసరంగా పేర్కొన్నాడు. తన నిర్ణయాన్ని శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు తెలియజేశానని చెప్పాడు. వెంటనే స్పందించిన లంక బోర్డు ఆమోదం తెలిపింది.

హసరంగ టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతని నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నామని లంక బోర్డు వివరించింది. ప్రస్తుతం వన్డే, టీ20లో చిరస్మరణీయ ప్రదర్శనలు చేస్తున హసరంగాకు టెస్టు జట్టులో మాత్రం చోటు దక్కడంలేదు. శ్రీలంక తరఫున ఇతను కేవలం నాలుగు టెస్టులే ఆడాడు. 2020లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.

- Advertisement -

ఈ ఆల్‌రౌండర్‌ 4 టెస్టుల్లో 196 పరుగులతో పాటు 4 వికెట్లు కూడా పడగొట్టాడు. హసరంగ శ్రీలంక తరఫున 48 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ప్రస్తుతం జరుగుతున్న లంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో బీలవ్‌కాండీ జట్టుకు సారథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో ఆల్‌రౌండర్‌ ప్రదర్శనలతో తమ జట్టును విజయ పథంలో నిలుపుతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement