రెండు అగ్రశ్రేణి జట్లపై వరుస సిరీస్ విజయాలు టీమిండియా నైతిక స్థైర్యాన్ని తప్పకుండా పెంచుతాయి. ముఖ్యంగా సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ఓడిన తర్వాత, ప్రపంచ చాంఫ్ ఆస్ట్రేలియాను ఓడించి సిరీస్ నెగ్గడం భారత జట్టుకు నిజంగా విశేషమే. ఇక స్వదేశంలో ఎన్నడూ దక్షిణాఫ్రికాపై సిరీస్ నెగ్గలేదన్న వెలితిని ఈ క్రమంలో మనజట్లు భర్తీ చేసుకుంది. వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గి సిరీస్ సొంతం చేసుకుంది. ఈ విజయాల పరంపరకు టీమిండియా ప్రశంసించదగినది. 6 మ్యాచ్‌ల్లో మూడుసార్లు 200 కంటే ఎక్కువ పరుగులు చేయడం థింక్ ట్యాంక్‌కు పెద్ద ఆందోళనగా ఉంది. ఎందుకంటే వారు జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీతో సరిపెట్టుక ోవలసి వచ్చింది.
బుమ్రా స్థానంలో మరొకరి ఎంపికను సెలెక్టర్లు ఇంకా ధ్రువీకరించలేదు. మొ#హమ్మద్ షమీ లేదా దీపక్ చాహర్ మధ్య పోటీ ఉండొచ్చు. ఇక షమీ గతకొంత కాలంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. వాస్తవానికి అతను చాలా రిథమిక్ బౌలర్. అతని రన్ అప్ క్రమబద్ధీకరించబడిన తర్వాత, వేగం, కచ్చితత్వంలో నికలడ సాధించాడు. మరొక బౌలర్ దీపక్ చా#హర్ది ప్రత్యేకశైలి. అతను పిచ్ నుండి స్వింగ్‌ను రాబట్టగలడు. బంతిని వేగంగా రెండువైపులా గింగిరాలు తిప్పగలడు. అంతేకాకుండా లోయర్ ఆర్డర్లో విలువైన బ్యాట్స్‌మన్‌గా కూడా సేవలు అందించగలడు. కొన్నిసార్లు ఉద్రిక్త ముగింపులో ఈ పరుగులు చాలా ఉపయోగ కరంగా ఉంటాయి.
అర్ష్‌దీప్ మొదటి గేమ్‌లో ఆకట్టుకున్నాడు. అతను పిచ్ పరిస్థితులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. అయితే, నో బాల్ సమస్యను అధిగమించాలి. అలాగే పిచ్‌పైకి పరిగెత్తడాన్ని నియంత్రించుకోవాలి. అలా చేస్తే, అతను బంతిని స్వింగ్ చేయగలడు. సీమ్ చేయగలడు. దీనితోపాటు గొప్ప యార్కర్లు వేయగలడు. మోసపూరిత బౌన్సర్‌ను కూడా కలిగి ఉన్నందున అతను దేశం కోసం చాలా కాలం ఆడగలడు. కొత్త బంతిని పంచుకునే విషయంలో, ఎడమచేతి బౌలర్లు ఏ జట్టుకైనా అదనపు బలమే. ఇక స్పిన్ డిపార్ట్మెంట్ తనపని తాను చూసుకుంటుంది. ఆస్ట్రేలియన్ పెద్ద మైదానాలలో స్పిన్ బౌలింగ్ ప్రాధాన్యతను కలిగివుంటుంది. ప్రస్తుత బ్యాటింగ్ ఆర్డర్ మెరుగ్గానే ఉంది. భారీ స్కోర్లను ఛేదించాల్సిన సమయంలో కెప్టెన్ తనవంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. తద్వారా మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి తగ్గించేలా చేస్తున్నాడు. ప్రపంచ కప్‌కు ఎంపికైన జట్టు యువత, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉంది. వీరి కృషికి కాస్తంత అదృష్టం తోడైతో ఆస్ట్రేలియా నుంచి ప్రపంపకప్ను స్వదేశం తీసుకురావడం సాధ్యమే.