Friday, November 22, 2024

IPL : హర్షా భోగ్లేపై గ‌రంగ‌రం…

ఐపీఎల్ సీజన్ లో భాగంగా తాజాగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ఇద్దరు మాజీ భారత దిగ్గజాల మధ్యకు గొడవకు దారి తీసింది. ఈ గొడవలో ప్రముఖ కామెంటరీ హర్షా భోగ్లే, మాజీ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ సోషల్ మీడియా వేదికగా వాగ్వివాదానికి దిగారు.

- Advertisement -

ఆ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదట బ్యాటింగ్ చేయగా చివర్లో ధోని సంచలాత్మక ఇన్నింగ్స్ కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లను కోల్పోయి 206 పరుగులను చేయగలిగింది. అయితే చెన్నై ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత అందుకు సంబంధించి హర్షా భోగ్లే తన ట్విట్టర్ ఖాతా ద్వారా చెన్నైను లక్ష్యంగా చేసుకొని ఈ స్కోర్ సరిపోదు అంటూ అభిప్రాయపడ్డాడు. నిజానికి ప్రతి మ్యాచ్ కు హర్ష ఇలానే స్పందిస్తుంటాడు. ఇదే సాంప్రదాయాన్ని కూడా మరోసారి అతను కొనసాగించాడు.

నిజానికి 206 పరుగుల లక్ష్యం నిజంగా మంచిదే. కాకపోతే ఈ పిచ్ పై ఏమాత్రం ఈ స్కోరు సరిపోదని.., డ్యూ ప్రభావంతో పాటు ఎక్కువగా బౌలింగ్ ఆప్షన్స్ లేని చెన్నై సూపర్ కింగ్స్ మరో 20 పరుగులు అదనంగా చేసి ఉంటే బాగుండేది అంటూ హర్ష ట్వీట్ చేశాడు. అయితే ఈ పోస్ట్ ను ఆధారంగా చేసుకుని తమిళనాడు మాజీ క్రికెటర్ టీమిండియా మాజీ స్పిన్నర్ లక్ష్మణ్ శివరామకృష్ణ హర్షా భోగ్లేపై తీవ్రంగా స్పందించాడు. మీరంతా ఎప్పుడు చెన్నై జట్టును తక్కువ చేసేందుకు ఇష్టపడతారని.. మీరు ఇలాంటి ఆటలు నాతో ఆడండి.. చెన్నై సూపర్ కింగ్స్ తో కాదని “ముంబై ఫ్రిక్స్” అంటూ ఘాటుగా స్పందించాడు. దీంతోపాటు అసలు నువ్వు ఎలా కామెంట్రేటర్ అయ్యావా అంటూ.. ఇన్నాళ్లు భారతదేశ క్రికెట్ లో నిన్ను ఎలా కొనసాగిస్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు శివరామకృష్ణన్.

ఇకపోతే ఈ మ్యాచ్ లో చెన్నై 20 పరుగుల తేడాతో విజయం సాధించగా.. దాంతో హర్షా భోగ్లే చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ మాత్రం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి హర్ష కాస్త ద్వంద బుద్దిని ఆవిలంబిస్తున్నట్లు అర్థమవుతోంది. దీని కారణం.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ సాధించిన అతడిపై వన్డే బ్యాటింగ్ అంటూ విమర్శలను గుప్పించాడు. ఇక అదే తరహాలో రోహిత్ శర్మ చేసిన సెంచరీని మాత్రం.. మరోవైపు రోహిత్ శర్మకు ఎవరైనా సహకారం అందించుంటుంటే అతడు మ్యాచ్ ను గెలిపించేవాడు అంటూ కామెంట్స్ చేశాడు. దీంతో విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కూడా హర్షపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement