Tuesday, November 26, 2024

హర్మన్‌ కౌర్‌పై రెండు మ్యాచ్‌లు నిషేధం

టీమిండియా మహిళా జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వన్డేల్లో రెండు మ్యాచ్‌ల నిషేధానికి గురైంది. రెండు వేర్వేరు ఘటనలకు సంబంధించి ఐసీసీ ప్రవర్తనా నియమావళి కింద ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ చర్యలు తీసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడవ వన్డే సందర్భంగా ఆమె అనుచితంగా ప్రవర్తించింది. ఎల్బీడబ్ల్యుగా ఔటైనట్లు అంపైర్‌ తీసుకున్న నిర్ణయం పట్ల అసహనం వ్యక్తంచేస్తూ బ్యాట్‌తో వికెట్లను గిరాటేసింది.

దీనికిగాను మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత విధించడంతోపాటు 3 డీమెరిట్‌ పాయింట్లు ఇచ్చింది. ట్రోఫీ బహుకరించే సమయంలోనూ మీరూ రండి అంటూ అంపైర్లపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసినందుకు లెవల్‌-1 అపరాధంగా భావిస్తూ మ్యాచ్‌ ఫీజులో 25శాతం జరిమానాతోపాటు ఒక డీమెరిట్‌ పాయింట్‌ ఇచ్చింది. ఐసీసీ తాజా నిర్ణయంతో హర్మన్‌ తదుపరి రెండు వన్డేలు, లేదా టీ20 మ్యాచ్‌లు లేదా ఒక టెస్టు మ్యాచ్‌కు దూరం కావాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement