టీ20 ప్రపంచకప్ర స్కాడ్ లో టీమిండియా ఆర్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎంపిక పై వివాదం చెలరేగుతోంది. ఫిట్‌గా లేని హార్దిక్‌ను టి20 ప్రపంచకప్‌కు ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావడం లేదని టీమిండియా మాజీ వికెట్ కీపర్ సబా కరీమ్ అన్నారు. ”హార్దిక్ మంచి ఆల్‌రౌండర్ అన్న విషయం తెలిసిందే. కాని అతని ఎంపికలోనే క్లారిటీ లేదు. పాండ్యా ఫిట్‌గా లేడని నా అభిప్రాయం. ఒకవేళ అతను ఫిట్‌గా ఉంటే అది నిరూపించుకోవాలి. ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో ముంబై రెండు మ్యాచ్‌లు ఆడగా.. ఆ రెండు మ్యాచ్‌లకు అతను దూరంగా ఉన్నాడని తెలిసింది. ఫిట్‌నెస్ లేమి అనేది ఐపీఎల్‌లో అతనికి సమస్య తేకపోవచ్చు.
కానీ టి20 ప్రపంచకప్‌లో ఇది పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే అతను టీమిండియాకు ఫ్రంట్‌లైన్ ఆల్‌రౌండర్. గాయంతో బాధపడుతున్నప్పుడు జట్టులోకి ఎలా తీసుకుంటారు. రూల్స్ ప్రకారం హార్దిక్ ఎస్‌సీఏకు వెళ్లి ఫిట్‌నెస్ నిరూపించుకొని తిరిగి రావాలి. ప్రతీ ఆటగాడి విషయంలో ఇదే వర్తిస్తుంది. మరి పాండ్యా విషయంలో అదెందుకు జరగలేదు. దీనికి బీసీసీఐ సమాధానం చెప్పాలి” అంటూ తెలిపాడు. ఇక అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకు యూఏఈ, ఒమన్ వేదికగా టి20 ప్రపంచకప్ జరగనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో ఆడనుంది.
ఇది కూడా చదవండి: ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్లు అరెస్టు