చీలమండ గాయం కారణంగా చాన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా తిరిగి బ్యాట్ చేతపట్టాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా పేరు ప్రకటించిన తర్వాత తొలిసారి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు.
ఐపీఎల్ 2024 ఎడిషన్ మార్చి 22 నుంచి ఆరంభం కానున్న నేపథ్యంలో ముంబై ప్రాక్టీస్ సెషన్లో ముమ్మర కసరత్తులు ప్రారంభించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ యాజమాన్యం ‘ఎక్స్’ వేదికగా షేర్ చేసింది.
24న గుజరాత్ టైటాన్స్ తో తొలి మ్యాచ్..
- Advertisement -
కాగా ఐపీఎల్ 2024 ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. మార్చి 24న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. గత రెండు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించిన జట్టుపైనే ముంబై తొలి మ్యాచ్ ఆడనుండడం గమనార్హం.