ముంబై ఇండియన్స్ నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర విమర్శలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ముంబై ఓటమికి హార్దిక్ కారణం అని మండిపడ్డాడు. గత కొంతకాలంలో తాను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ హార్దిక్‌దే అని ఘూటు వ్యాఖ్యలు చేశాడు. ముంబై-సీఎస్కే మ్యాచ్ గురించి తన స్టైల్లో గవాస్కర్ విశ్లేషించాడు.
ఆఖరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ (20*; 4 బంతుల్లో, 3×6) సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ధోనీ దెబ్బకి హార్దిక్ 20వ ఓవర్లో 26 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ పరుగులో సిఎస్కే విజయానికి కారణమయ్యాయి..దీంతో గవాస్కర్ అతడిపై విమర్శల జోరు పెంచాడు ..
”గత కొంతకాలంగా నేను చూసిన చెత్త బౌలింగ్ ఇదే. నా హీరో కోసం సమర్పించుకుంటాను అన్నట్లుగా ఉంది. ఈ తరహాలో బ్యాటింగ్ చేస్తాను, అతడు సిక్సర్లు సాధిస్తాడనే పరిస్థితి కనిపించింది. ఓ సిక్సర్ ఫర్వాలేదు. కానీ తర్వాత బంతిని కూడా లెంగ్త్ బాల్ వేశాడు. బ్యాటర్ దాని కోసమే ఎదురుచూస్తాడని తెలుసు. ఇక మూడో బంతి లెగ్ సైడ్ ఫుల్ టాస్ వేశాడు. ధోనీ దాని కోసమే చూశాడు. సిక్సర్ సాధించాడు. ఇది కచ్చితంగా సాధారణమైన బౌలింగ్, సాధారణ కెప్టెన్సీ. సీఎస్కే 185-190 పరుగులకే కట్టడి చేయాల్సింది” అని హార్దిక్‌ను ఉద్దేశిస్తూ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.