టీమిండియా క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్ని ఫార్మాట్లకు సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు అధికారికంగా… తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు హర్భజన్ సింగ్. చాలాకాలంగా జట్టులో చోటు కోసం ఎదురుచూసినా ఫలితం లేకపోవడం వల్ల ఆటకు రిటైర్మెంట్ ఇస్తున్నట్లు ప్రకటించాడు. హర్భజన్ సింగ్ ఇప్పటి వరకు 367 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో ఏకంగా 711 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు టెస్ట్ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. ప్రస్తుతం హర్భజన్ సింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఎల్లవేళలా తనకు మద్దతుగా నిలిచిన అభిమానులు కృతజ్ఞతలు తెలిపాడు.
ఎన్నో మంచి అవకాశాలు నాకు వచ్చాయి. ఈ రోజు నేను జీవితంలో నాకు అన్నింటినీ అందించిన ఆటకు వీడ్కోలు పలుకుతున్నాను. ఈ 23 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణాన్ని అందంగా మరియు చిరస్మరణీయంగా మార్చిన ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా కెరీర్ నాకు సహకరించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు హర్భజన్ సింగ్.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital