ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఇండియా కుర్రాళ్లు మాంచి జోరుమీదున్నారు. టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ ఎంచుకోంగా, అయిదు ఓవర్లలోనే నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ వెన్నువిరిచారు మన బౌలర్లు. రాయ్ (0) డక్ అవుట్, రూట్ (0) డక్ అవుట్, బెన్ స్ట్రోక్స్ (0) డక్, బైరిస్టో (7) అవుటయ్యారు. కాగా, బుమ్రా మూడు వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ 1 వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం బట్లర్ (8), లివింగ్‌స్టోన్ (..) బ్యాటింగ్ చేస్తున్నారు.
ఇక.. లండన్‌లోని ఓవల్ స్టేడియం వేదికగా ఈ రోజు ఇంగ్లండ్- ఇండియా వన్ డే మ్యాచ్ ప్రారంభం అయ్యింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో భారత్ తొలి వన్డేలో విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను డ్రా చేసుకున్న భారత్ ఇటీవలి టీ20 సిరీస్‌లో అద్భుతమైన ఫామ్‌ను కనబరిచి ఈ సిరీస్ ను 2-1 తేడాతో గెలుచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టన్ రోహిత్ శర్మ.. ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించాడు.
ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌ను ఫస్ట్ బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఇంగ్లండ్‌తో 3 వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. తాజాగా 3 మ్యాచ్‌లతో కూడిన వన్డే సిరీస్‌ను అయినా చేజిక్కించుకోవాలన్న కసితో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఎలాగైనా కట్టడి చేయాల్సిందేనన్న దిశగా టీమిండియా బరిలోకి దిగుతోంది. ఇంగ్లండ్ ప్లేయర్స్ జోస్ బట్లర్, బెన్ స్టోక్స్, జానీ బెయిర్‌స్టో వంటి వారు భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలని, వారి సోంత గడ్డ పై మంచి ప్రదర్శనను ప్రదర్శించాలని చూస్తున్నారు.