భారత కుర్రాళ్లు కుమ్మేశారు.. తొలి రెండు మ్యాచ్‌ల్లో దెబ్బతిన్న జట్టులో వేగం పుంజుకుంది. నాలుగో మ్యాచ్‌లో సఫారీలను 100లోపే సఫా అనిపించారు. 87 పరుగులకే సౌతాఫ్రికాను కట్టడి చేశారు భారత బౌలర్లు. దీంతో ఇండియా 82 పరుగుల ఘన విజయం సాధించింది. సౌతాఫ్రికాతో జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇండియా తొలి రెండు మ్యాచులు దారుణంగా ఆడింది. దీంతో సఫారీలు 2.0తో ముందంజంలో ఉండేవారు. కాగా, విశాఖ మ్యాచ్‌తో ఇండియన్ టీమ్ దూకుడు పెంచింది.
విశాఖలో గెలుపు ఉత్సాహంతో ఇవ్వాల (శుక్రవారం) రాజ్‌కోట్‌లో జరిగిన 4వ మ్యాచ్‌లోనూ విజయం సాధించారు. దీంతో సిరీస్‌లో 2.2తో సమానంగా ఉన్నారు. ఇక లాస్ట్ మ్యాచ్ నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలన్న తపనతో టీమిండియా జోష్ మీదుండగా.. ఇండియాను పడగొట్టి సిరీస్ తామే ఎగరేసుకుపోవాలని సఫారీ జట్టు పట్టుమీదుంది..
ఇక.. భారత్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో సౌతాఫ్రికా తడబడుతోంది. భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేక వరుసగా వికెట్లు కోల్పోతూ పెవిలియన్ చేరుతున్నారు బ్యాట్స్‌మన్. అయితే ప్రమాదకరమైన క్లాసెన్ (8)ను చాహల్ పెవిలియన్ చేర్చాడు. చాహల్ వేసిన 9ఓవర్ తొలి బంతికి క్లాసెన్ బౌండరీ బాదాడు. ఆ మరుసటి బంతికే అతన్ని పెవిలియన్ చేర్చాడీ లెగ్‌స్పిన్నర్. చాహల్ వేసిన స్ట్రెయిట్ డెలివరీని ఆడటంతో క్లాసెన్ తడబడ్డాడు.
దాంతో బంతి అతని ప్యాడ్లను తాకింది. అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు. కానీ క్లాసెన్ రివ్యూ కోరాడు. రిప్లేలో కూడా క్లాసెన్ అవుటనే రావడంతో మైదానం వీడాల్సి వచ్చింది. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి సఫారీలు 58/3 స్కోరుతో నిలిచింది. అంతేకాకుండా.. 14 ఓవర్లు పూర్తయ్యే సరికి 79 పరుగులు మాత్రమే చేసి కీలకమైన 7 వికెట్లు పోగొట్టుకుని సఫారీలు కష్టాల్లో కూరుకుపోయారు.