ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) రెండో సీజన్‌లో భాగంగా ఇవ్వాల జరగనున్న కీలక మ్యాచ్‌లో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ మహిళల జట్లు తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌ల ప్రారంభానికి ముందు ఆఖరి మ్యాచ్ ఆడుతున్న యూపీ ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లేఆఫ్ రేసులో సజీవంగా ఉండాలని పట్టుదలగా బరిలోకి దిగనుంది.
యూపీ వారియర్స్ :
అలిస్సా హీలీ (c/wk), కిరణ్ ప్రభు నవ్‌గిరే, చమరి అతపత్తు, దీప్తి శర్మ, గ్రేస్ హారిస్, శ్వేతా సెహ్రావత్, సోఫీ ఎక్లెస్టోన్, పూనమ్ ఖేమ్నార్, సైమా ఠాకోర్, అంజలి సర్వానాయక్, రాజేశ్వరి జి
గుజరాత్ జెయింట్స్ :
బెత్ మూనీ (c/wk), లారా వోల్వార్డ్ట్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, దయాలన్ హేమలత, ఆష్లీ గార్డనర్, భారతీ ఫుల్మాలి, క్యాథరిన్ బ్రైస్, తనూజా కన్వర్, మన్నత్ కశ్యప్, మేఘనా సింగ్, షబ్నమ్ MD షకీల్
ఇదిలా ఉండగా, గత సీజన్‌లో ఫైనలిస్టులు ఇప్పటికే ప్లేఆఫ్‌లతో తమ బెర్త్‌ను ఖాయం చేసుకున్నారు. ఎలిమేటర్స్ రౌండ్ లో పోటీ పడేందుకు ఒకే ఒక్క స్థానం మిగిలి ఉండగా.. ఆ స్థానం కోసం ఆర్సీబీ, యూపీ జట్ల మధ్య పోటీ నెలకొంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే యూపీ జట్టు పాయింట్ల పట్టికలో తొలి మూడు స్థానాల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఇవ్వాల్టి మ్యాచ్‌లో యూపీ గెలిచి, రేపు జరగనున్న మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోతే, ప్లేఆఫ్స్‌కు యూపీ జట్టు అర్హత సాధిస్తుంది. యూపీ, ఆర్సీబీ గెలిస్తే, నెట్‌రన్‌రేట్ ఆధారంగా ప్లేఆఫ్ అర్హులను నిర్ణయిస్తారు.