క్వాలిఫయర్ సెకండ్ మ్యాచ్‌లో భాగంగా ఇవ్వాల (శుక్రవారం) జరిగిన కీలక మ్యాచ్‌లో ముంబయి దారుణంగా ఓడిపోయింది. టాస్ గెలిచిన ముంబయి జట్టు తొలుత బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి రికార్డు స్థాయిలో స్కోరు చేయగలిగింది. ఇందులో మాస్టర్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇక మొత్తం 233 పరుగులతో గుజరాత్ అద్భుతంగా రాణించి.. ముంబయి ముందు 234 పరుగుల అతిపెద్ద టార్గెట్‌ని పెట్టగలిగింది.
కాగా, చేజింగ్‌కు దిగిన ముంబయి జట్టు ఆదిలోని ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ ఇంజూరీ కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే.. కెప్టెన్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. అయితే.. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ (30), సూర్యకుమార్ (61) కలిసి స్కోరు బోర్డుని పరుగులు పెట్టించే పనిలో పడ్డారు. ఇక.. వీరి సక్సెస్ఫుల్ జంటను బి. లిటిల్ విడగొట్టి స్కోరు బోర్డుకు బ్రేకులు వేశాడు. ఆ తర్వాత వచ్చిన తిలక్‌వర్మ (43) కూడా కాస్త పోరాటం చేసినప్పటికీ.. వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు ఎవరూ పరుగులు రాబట్టలేకపోయారు. దీంతో గుజరాత్ బౌలర్లు రెచ్చిపోయి ఆడడంతో ఇంకా 2 ఓవర్లు మిగిలి ఉండగానే ముంబయి ఆల్ అవుట్ అయ్యింది. దీంతో గుజరాత్ 62 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్స్‌లోకి ఎంటరయ్యింది. ఎల్లుండి జరిగే మ్యాచ్‌లో చెన్నై, గుజరాత్ పోటీ పడనున్నాయి.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 5 వికెట్లు తీయగా.. మహ్మద్ షమీ, రశీద్ ఖాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. జాషువా లిటిల్ ఒక వికెట్ తీశాడు.