Wednesday, November 20, 2024

GT vs RCB – విల్ జాక్ శతకం – ఆర్సీబీ ఘన విజయం

గుజ‌రాత్ టైటాన్స్‌ ను వాళ్ల సొంత‌గ‌డ్డ‌పైనే 9 వికెట్ల‌తో చిత్తు చేసింది ఆర్సీబీ.. ఆకాశ‌మే హ‌ద్దుగా ఆడిన ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్(100 నాటౌట్) సెంచరీతో బెంగ‌ళూరును గెలిపించాడు. దాంతో, ఆర్సీబీ ఖాతాలో మూడో విక్ట‌రీ చేరింది. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ(70 నాటౌట్) సైతం హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా 200 ప‌రుగుల ల‌క్ష్యాన్ని15.5 ఓవ‌ర్ల‌కే ఛేదించింది.

భారీ ఛేద‌న‌లో ఓపెనింగ్ జోడీ మ‌ళ్లీ విఫ‌ల‌మైంది. ప‌వ‌ర్ ప్లేలోనే ఆర్సీబీ తొలి వికెట్ ప‌డింది. ఓపెన‌ర్ ఫాఫ్ డూప్లెసిస్(24) భారీ షాట్ ఆడి ఔట‌య్యాడు. సాయి కిశోర్ ఓవ‌ర్లో బౌండ‌రీ వ‌ద్ద విజ‌య్ శంక‌ర్ చేతికి చిక్కాడు. దాంతో, 40 ప‌రుగుల వ‌ద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న విల్ జాక్స్ క్రీజులోకి వ‌చ్చాడు. కోహ్లీ జ‌త‌గా జాక్స్ ఓ రేంజ్‌లో ఆడాడు. ర‌షీద్ ఖాన్ వేసిన 16వ ఓవ‌ర్లో జాక్స్ మ‌రింత రెచ్చిపోయాడు. వ‌రుస‌గా 6, 6, 4, 6, 6 బాదేసి శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఆర్సీబీ 9 వికెట్ల‌తో గెలుపొందింది.

అంతకుముందు సొంత గ‌డ్డ‌పై యువ‌కెర‌టం సాయి సుద‌ర్శ‌న్(84 నాటౌట్), చిచ్చ‌ర‌పిడుగు షారుఖ్ ఖాన్(58)లు హాఫ్ సెంచ‌రీల‌తో క‌దం తొక్కారు. 45 ప‌రుగుల‌కే రెండు వికెట్లు ప‌డినా.. వీళ్లిద్ద‌రూ బౌండ‌రీల‌తో చెల‌రేగారు. చివ‌ర్లో డేవిడ్ మిల్ల‌ర్(26 నాటౌట్) సైతం బ్యాట్ ఝులిపించ‌డంతో గుజ‌రాత్ నిర్ణీత ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 200 ర‌న్స్ కొట్టింది. అయితే ఈ లక్ష్యాన్ని 16 ఒవర్ల లోపే ఆర్సీబీ పూర్తి చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement