మహిళల ఆసియా కప్ లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్ పాకిస్థాన్ జట్టు ఘన విజయం సాధించింది. శ్రీలంకలోని దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా గ్రూప్ ఏలో ఉన్న యూఏఈతో తలపడిన పాక్ మహిళల జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. టోర్నీని ఓటమితో ఆరంభించిన పాకిస్థాన్…. ఈ విజయంతో గ్రూప్-ఎలో పాయింట్ల పట్టికలో నాలుగు పాయింట్లతో రెండో స్థానానికి చేరుకుని నాకౌట్ కు చేరే అవకాశం దక్కించుకుంది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ మహిళల జట్టును నిర్ణీత 20 ఓవర్లలో 103 పరుగులకే పరిమితం చేసిన పాకిస్థాన్…. ఆపై ఛేదనలో దుమ్మురేపింది. యూఏఈ నిర్ధేశించిన స్వల్ప టార్గెట్ ను ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 14.1 ఓవర్లలో ఛేదించింది. పాకిస్థాన్ ఓపెనర్ గుల్ ఫిరోజా (62 నాటౌట్) బౌండరీలపై బౌండరీలు బాది హాఫ్ సెంచరీ సాధించగా… ఆమెకు తోడుగా.. మోర్ ఎండ్ లో మునిబా అలీ (37 నాటౌట్) అద్భుతంగా రాణించింది.. దీంతో పాకిస్థాన్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.