– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
ఫైనల్స్ని కన్నులపండువగా నిర్వహించేందుకు మ్యూజిక్ మాస్ట్రో ఏఆర్ రెహమాన్, బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ రానున్నట్టు తెలుస్తోంది. వీరితోపాటు రాపర్ కింగ్ డీజే న్యూక్లియా, సింగర్ వివైన్ జోనితా గాంధీ ప్రదర్శన కూడా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ముగింపు వేడకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ ఫైనల్స్‌కు ముందే సెలబ్రేషన్స్ ఉండనున్నాయి. దీని కోసం బీసీసీఐ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది.
వేడుకలకు రాపర్ కింగ్, DJ న్యూక్లియా, గాయకులు డివైన్, జోనితా గాంధీ ప్రదర్శన ఇవ్వనున్నట్లు ఇవ్వాల (శుక్రవారం) ప్రకటించారు. మే 28 (ఆదివారం) అహ్మదాబాద్‌లోని స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రసిద్ధ ఎంటర్‌టైనర్‌ల ప్రదర్శనలతో టోర్నమెంట్ ముగింపు అంగరంగ వైభంగా నిర్వహించనున్నారు. కాగా, IPL 2023 ఈ ఏడాది మార్చి 31వ తేదీన గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్‌తో ప్రారంభమైంది.
కాగా, ప్రారంభ మ్యాచ్‌లో బాలీవుడ్ తారలు రష్మిక మందన్న, తమన్నా భాటియా ప్రదర్శన ఇచ్చారు. సింగర్ అరిజిత్ సింగ్ తన పెప్పీ పాటలతో అలరించారు. టోర్నీలో గుజరాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచింది. COVID-19 కారణంగా రెండేళ్లపాటు మ్యాజ్లు జరగలేదు. ఆ తర్వాత ఐపీఎల్ 2023 పేరుతో ఈసారి టోర్నమెంట్ జరుగుతోంది. ఫైనల్ మ్యాచ్ ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.