కేంద్ర క్రీడాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో క్షేత్రస్థాయిలో ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు తీసుకొచ్చిన ఖేలోఇండియా ద్వారా ప్లేయర్లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిర్ణయం తీసుకున్నారు.
- Advertisement -
దీంతో ఇప్పటి వరకు ఖేలో ఇండియా వేర్వేరు విభాగాల్లో పతకాలు సాధించిన ప్లేయర్లు ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. ప్రధాని నరేంద్రమోదీ విజన్ మేరకు 2018లో ఖేలో ఇండియా ప్రారంభమైంది. అప్పటి నుంచి వేర్వేరు రాష్ర్టాలు వేదికలుగా పోటీలు జరుగుతున్నాయి..