Tuesday, November 26, 2024

కోహ్లీ అలా చేయకుండా ఉండాల్సింది: గంభీర్..

విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2021 సీజన్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోనున్నట్లు ఆదివారం రాత్రి ప్రకటించాడు. విరాట్ కోహ్లీ నిర్ణయంపై సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. కాగా కోహ్లీ అకస్మాత్తు ప్రకటన తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు గౌతమ్ గంభీర్. అందుకు ఇది సరైన సమయం కాదు. రెండో అంచె ప్రారంభానికి ముందు ఇలా చేయడమేమిటి? ఈ ప్రకటన అనవసరంగా ఆటగాళ్లపై ఒత్తిడిని పెంచుతుంది. ఈసారి వాళ్లు మంచి పొజిషన్‌లో ఉన్నారు. విరాట్‌ ఈ సీజన్‌ తర్వాత కెప్టెన్‌గా ఉండడు కాబట్టి ఎలాగైన కప్‌ గెలవాలనే ఆశయం వారిపై అధిక భారాన్ని మోపుతుంది. ఓ వ్యక్తి కోసం కాదు.. ఫ్రాంఛైజీ కోసం టైటిల్‌ గెలవాలి. ఈ విషయాన్ని కోహ్లి గుర్తుపెట్టుకుంటే ఈ సమయంలో ఈ ప్రకటన చేసేవాడు కాదు’’అని విమర్శించాడు.

కెప్టెన్‌ పదవి నుంచి వైదొలగడం, ఆటకు గుడ్‌బై చెప్పడం అనేవి రెండు వేర్వేరు నిర్ణయాలు. కోహ్లి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. అయితే,  ఇది ఆటగాళ్లను భావోద్వేగానికి గురిచేసే సమయం. ఏదేమైనా కోహ్లి ఇప్పుడు ఈ ప్రకటన చేయడం అస్సలు సరైనది కాదు’’ అని గంభీర్‌ వ్యాఖ్యానించాడు. 2013లో బెంగళూరు టీమ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ.. ఈ 9 ఏళ్లలో బెంగళూరు టీమ్‌ని 132 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా నడిపించాడు. ఇందులో 62 మ్యాచ్‌ల్లో బెంగళూరు గెలుపొందగా.. 66 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మిగిలిన 4 మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు.

ఇది కూడా చదవండి: విడాకుల కోసం వెళితే కోర్టులో పెళ్లి..!

Advertisement

తాజా వార్తలు

Advertisement