Tuesday, July 2, 2024

Euro Cup | పోర్టుగల్ శుభారంభం.. చెకోస్లోవేకియాపై విజ‌యం

యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌ 2024లో దిగ్గజ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో జట్టు పోర్చుగల్‌ బోణీ కొట్టింది. గ్రూప్‌-ఎఫ్‌లో భాగంగా ఇవాళ (జూన్‌ 19) జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్‌.. చెకోస్లోవేకియాపై 2-1 గోల్స్‌ తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి అర్ద భాగంలో ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా సాధించలేదు.

ద్వితియార్ధంలో తొలుత (62వ నిమిషంలో, లుకాస్‌ ప్రొవోద్‌) చెక్‌ రిపబ్లిక్‌, ఆతర్వాత పోర్చుగల్‌ (69వ నిమిషంలో, రాబిన్‌ హ్రనాక్‌) గోల్స్‌ చేయడంతో స్కోర్లు సమం అయ్యాయి. అయితే నిర్ణీత సమయం ముగిశాక 92వ నిమిషంలో ఫ్రాన్సిస్కో అద్భుతమైన గోల్‌ చేయడంతో పోర్చుగల్‌ 2-1 తేడాతో విజయం సాధించింది.

చరిత్ర సృష్టించిన క్రిస్టియానో రొనాల్డో..

చెక్‌ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా పోర్చుగల్‌ స్టార్‌ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో చరిత్ర సృష్టించాడు. రొనాల్డో ఆరు యూరో కప్‌లు ఆడిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. రొనాల్డో 2004, 2008, 2012, 206, 2020, 2024 ఎడిషన్లలో పాల్గొన్నాడు. రొనాల్డో తర్వాత క్రొయేషియా ఆటగాడు లూకా మోడ్రిక్‌, పోర్చుగల్‌ ఆటగాడు పెపె అత్యధికంగా ఐదు యూరో కప్‌లు ఆడాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement