స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. స్మృతి మంధాన నేతృత్వంలోని టీమ్‌ఇండియా ఐర్లాండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది.
ఆ జట్టు కెప్టెన్ గాబీ లూయిస్ (92) తృటిలో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. లీహ్ పాల్ (59) అర్ధ సెంచరీతో రాణించింది. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా (2/56) రెండు వికెట్లు తీయగా, టైటస్ సాధు, సయాలీ, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం ఛేజింగ్ కు దిగిన భారత మహిళల జట్టు… 34.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరుకుంది. కెప్టెన్ స్మృతి మంధాన (41) శుభారంభం అందించింది. టీమిండియా ఓపెనర్ ప్రతీకా రావల్ (83), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో 4 వికెట్లకు 241 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. గెలపుతో మూడు వన్డేల సిరీస్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది.