Euro Cup | ఇంగ్లండ్ శుభారంభం.. సెర్బియా పై విజ‌యం

యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇంగ్లాండ్‌ శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 1-0తో సెర్బియాపై విజయం సాధించింది. 13వ నిమిషంలో హెడర్‌తో జూడ్‌ బెలింగ్‌హామ్ ఇంగ్లాండ్‌కు ఆధిక్యాన్నిచ్చాడు. హారీ కేన్‌ రెండో అర్ధభాగంలో ఆ జట్టు ఆధిక్యాన్ని 2-0కు పెంచింనంత పనిచేశాడు. కానీ సెర్బియా గోల్‌ కీపర్‌ రజ్కోవిచ్‌ అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. మ్యాచ్‌ అనంతరం ఇంగ్లాండ్‌ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఇంగ్లాండ్‌ జట్టు గ్రూప్‌-సిలో అగ్రస్థానంలో ఉంది. మరో మ్యాచ్‌ (గ్రూప్‌-ఇ)లో రొమేనియా 3-0తో ఉక్రెయిన్‌ను మట్టికరిపించింది. రొమేనియా తరఫున నికోల్‌ స్టాన్సియు (29వ), రజ్వాన్‌ మారిన్‌ (53వ), డెనిస్‌ డ్రేగస్‌ (57వ) తలో గోల్‌ కొట్టారు. కాగా, మ్యాచ్‌కు ముందు ఇంగ్లాండ్, సెర్బియా అభిమానులు కొట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది.

అప్ర‌తి విజ‌యాలు..

ప్రతిష్ఠాత్మక యూరో చాంపియన్‌షిప్ లో మరో సంచలనం నమోదైంది. తొలి నాలుగు మ్యాచుల్లోనే 16 గోల్స్‌తో 48 ఏండ్ల రికార్డు బద్ధలైన చోట.. హ్యారీ కేన్ సారథ్యంలోని ఇంగ్లండ్ చరిత్ర సృష్టించింది. వరుసగా ఐదు విజయాలతో టోర్నీలో కొత్త అధ్యాయం లిఖించింది. సెర్బియాతో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 1-0తో జయకేతనం ఎగురవేసింది. దాంతో, 2020 నుంచి యూరో చాంపియన్‌షిప్ నాలుగు సీజన్లలో తొలి మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుగా ఇంగ్లిష్ టీమ్ రికార్డు నెలకొల్పింది.

తద్వారా యూరో చాంపియన్‌షిప్ చరిత్రలోనే వరుసగా ఐదు విజయాలు సాధించిన తొలి జట్టుగా కొత్త చరిత్రను లిఖించింది.ఇంగ్లండ్ జట్టు 2020 ఎడిషన్‌లో చెక్ రిపబ్లిక్‌కు చెక్ పెట్టింది. ఆ తర్వాతి సీజన్లలో వరుసగా స్కాట్లాండ్, క్రొయేషియా, స్లొవేకియాలను చిత్తు చేసింది. తాజాగా జర్మనీలో జరుగుతున్న ఎడిషన్‌లో ఇంగ్లండ్ బలమైన సెర్బియాను మట్టికరిపించి సాకర్ పండుగ చరిత్రలోనే అరుదైన రికార్డు ఖాతాలో వేసుకుంది.

Exit mobile version